Tuesday, December 21, 2010
Thursday, May 27, 2010
మన హై స్కూల్ - ఇప్పటి స్థితి(ఈ పోస్ట్ ని ఓల్డ్ స్టూడెంట్స్ తప్పక చదవాలి )
మన దగ్గుబాడు కమిటీ హై స్కూల్ పెట్టి చాల దశాబ్దాలు అయింది. ఈ స్కూల్ మొదలు పెట్టిన సమయం లో , ఆ రోజులలో చాల తక్కువ పల్లెటూళ్ళలో స్కూల్సు ఉండేవి. చాలా ఊళ్ళలో అసలు ఎలెమెంటరీ స్కూల్ కూడా అప్పట్లో వుండేది కాదు. అలాంటిది మన పెద్దలు మన ఊరి బాగు కోసం, ఊరిలో పిల్లలు విద్యవంతులయితే మంచి భవిష్యత్తు ఉంటుందనే సదుద్దేశం తో ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈ స్కూలుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో వేల మంది పిలల్లు ఈ స్కూల్లో చదువుకుని బయిటికి వెళ్లి ఫై చదువులు చదివి మంచి ఉద్యోగాలలో స్తిరపడ్డారు.
కాని రోజులు, నెలలు , సంవత్సరాలు, దసాబ్దాలతోపాటుగా మన చదువులలోనూ చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వాలు మారాయి, ప్రభుత్వ విధానాల్లోను పెను మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్నఉపాధ్యాయులు రిటైర్ ఐతే ప్రభుత్వం ఆ పోస్ట్లు భర్తీ చేయడం లేదు. ఇలా ఇప్పటికే కొంత మంది రిటైర్ అయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని పెట్టాలంటే ఎవరో ఒకరు దాతలు సాయ పడాల్సిందే. ఇలా కొంతమందిని ఇప్పటికే చేర్చుకున్నారు. వారికి ప్రభుత్వం వారు జీతాలు ఇవ్వరు, పైన చెప్పిన విధంగ ప్రైవేటు వ్యక్తుల సాయం తప్పనిసరి. ఉపాధ్యాయుల సమస్య ఇలావుంటే, స్కూల్ భవనాలు చాలా పాతవి అవడం మూలంగా కొన్ని తరగతులు జరపడం చాలా కష్టం గా వుంది. కొత్త భవనాల కి మళ్ళీ సహాయం అవసరం. ఇప్పుడు ముఖ్యం గా బిల్డింగ్ కట్టటానికి దాతల సాయం చాల అవసరం. ఈ స్కూల్ భవిష్యత్
అంతా మనలాంటి ఓల్డ్ స్టూడెంట్స్ సహాయం మీద లేదా ఎవరైనా దాతల సాయం మీదే ఆధారపడి వుంది.
మీరు ఈ పోస్ట్ ని చదివితే మీ అమూల్యమైన సలహాలు ఇవ్వగలరని , అవసరం అయితే చేయగల్గిన సాయం చేయగలరని, ముఖ్యంగా మనమందరమూ ఈ స్కూల్ పునర్నిర్మాణంలో పాలుపంచుకోగలమని మన గ్రామం లో పేద పిల్లలు ఎదురు చూస్తున్నారు!

Subscribe to:
Posts (Atom)